టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే కార్యక్రమం ప్రారంభించిన క్రీడాకారిణి?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే’ కార్యక్రమం మార్చి 25న ప్రారంభమైంది.
2011లో భూకంపం, సునామీ, న్యూక్లియర్ విస్ఫోటనాల ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఫుకుషిమా వద్ద ఈ జ్యోతిని వెలిగించి పరుగు ప్రారంభించారు. 2011 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలైన అజుసా ఇవషిమిజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలైంది. జపాన్‌లోని 47 ప్రాంతాల మీదుగా ప్రయాణించే టార్చ్ 121 రోజుల తర్వాత క్రీడల ప్రారంభం రోజైన జులై 23కు టోక్యో చేరుకుంటుంది. జపాన్ రాజధాని టోక్యో 2021, జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ఫుట్‌బాల్ క్రీడాకారిణి అజుసా ఇవషిమిజు
ఎక్కడ : ఫుకుషిమా, జపాన్క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ఫుట్‌బాల్ క్రీడాకారిణి అజుసా ఇవషిమిజు
Published date : 27 Mar 2021 05:08PM