Skip to main content

టోక్యో ఒలింపిక్స్ టార్చ్ ఆవిష్కరణ

2020 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న జపాన్‌లోని టోక్యో నగరంలో మార్చి 20న టార్చ్‌ను ఆవిష్కరించారు.
బంగారు వర్ణంలో 28 అంగుళాలు పొడవు, 1.2 కిలోల బరువున్న ఈ టార్చ్ పైభాగంలో ఐదు రేకులతో ఉండే చెర్రీ బ్లాసమ్ పువ్వు ఆకారం కనిపిస్తుంది. 2011లో సంభవించిన భూకంపం, సునామీ బాధితుల కోసం తాత్కాలికంగా ఇళ్లను నిర్మించగా వచ్చిన వేస్టేజ్ అల్యూమినియం లోహంతో ఈ టార్చ్‌ను రూపొందించారు. మార్చి 26న టార్చ్ రిలే మొదలవనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020 టోక్యో ఒలింపిక్స్ టార్చ్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 20
ఎక్కడ : టోక్యో, జపాన్
Published date : 21 Mar 2019 05:23PM

Photo Stories