Skip to main content

తొలిసారిగా మైనస్‌లోకి ముడి చమురు ధ‌ర‌లు

అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా ‘నెగిటివ్‌’(మైనస్‌)లోకి జారిపోయాయి.
Current Affairs
అమెరికాలో నిల్వ సామర్థ్యం లేకపోవడం, కరోనా వైరస్‌ కల్లోలంతో పలు దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో డిమాండ్‌ బాగా తగ్గడం, లాక్‌డౌన్‌ ముగిసి డిమాండ్‌ ఎప్పుడు పుంజుకుంటుందో స్పష్టత లేకపోవడం, ట్రేడర్లు చమురు డెలివరీలకు ఇష్టపడకపోవడంతో ధరలు ఈ రేంజ్‌లో పడిపోయాయి. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (డబ్ల్యూటీఐ) చమురు ధర (మే ఫ్యూచర్స్‌) ఏప్రిల్ 17న‌ ఒక్క బ్యారెల్‌కు 18.27 డాలర్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 20న ఒక దశలో 220 శాతం (40 డాలర్లకు) పైగా నష్టంతో మైనస్‌ 28 డాలర్లకు పడిపోయింది. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో డబ్ల్యూటీఐ చమురు 1983 ఏప్రిల్‌ నుంచి ట్రేడవడం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అత్యధిక కనిష్ట ధర. కాగా జూన్‌ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 22.25 బ్యారెల్‌ వద్ద ట్రేడ్‌ అవుతోంది. మే, జూన్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ల ధరల తేడా (స్ప్రెడ్‌) భారీగా (40 డాలర్లకు మించి) ఉండటం విశేషం. రెండు వరుస నెలల ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ల ధరల తేడా ఈ రేంజ్‌లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తొలిసారిగా మైనస్‌లోకి ముడి చమురు ధ‌ర‌లు
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎక్కడ : అమెరికా మార్కెట్‌
ఎందుకు : కరోనా వైరస్‌ కల్లోలంతో
Published date : 21 Apr 2020 06:50PM

Photo Stories