తొలిసారి అంటార్కిటిక్ త్వైట్స్ చిత్రాలు
Sakshi Education
సముద్రాల నీటి మట్టం పెరగడానికి ముఖ్యకారణమైన అంటార్కిటిక్ ఖండంలోని త్వైట్స్ అనే మంచు కొండకు సంబంధించిన చిత్రాలను శాస్త్రవేత్తలు తొలిసారి చిత్రీకరించారు.
అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రోబోటిక్ సబ్‌మెరైన్ సాయంతో చిత్రాలను తీశారు. వీటి సాయంతో త్వైట్స్ కదలికలను క్షుణ్నంగా పరిశీలించే అవకాశం లభించనుంది. త్వైట్స్ కారణంగా భూమిపై సముద్రాల నీటి మట్టం 4 శాతం మేర పెరుగుతుంది. దీని కదలికల్లో చోటుచేసుకునే చిన్న పరిణామాల వల్ల కూడా సముద్ర నీటి మట్టాలు 25 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉంది. గత 30 ఏళ్లలో త్వైట్స్ నుంచి సముద్రాల్లోకి ప్రవహించే మంచు శాతం రెట్టింపైనట్టు పరిశోధకులు వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలిసారి అంటార్కిటిక్ త్వైట్స్ చిత్రాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు
ఎందుకు : త్వైట్స్ కదలికలను క్షుణ్నంగా పరిశీలించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలిసారి అంటార్కిటిక్ త్వైట్స్ చిత్రాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు
ఎందుకు : త్వైట్స్ కదలికలను క్షుణ్నంగా పరిశీలించేందుకు
Published date : 04 Feb 2020 05:10PM