తొలి స్వదేశీ పిస్తోల్ రెడీ చేసిన ప్రభుత్వం సంస్థ ఏది?
Sakshi Education
ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో ముందడుగు వేసింది.
భారత సైన్యంతో కలసి డీఆర్‌డీవోకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (పుణే) విభాగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తొలి 9 ఎంఎం మెషీన్ పిస్తోల్‌ను అభివృద్ధి చేసింది. దీనికి ‘అస్మి’అనే పేరు పెట్టారు. ఈ సరికొత్త పిస్తోల్‌ను కేవలం నాలుగు నెలల్లోనే అభివృద్ధి చేయడం విశేషం. విమానాల తయారీలో వాడే అల్యూమినియంతో ఈ పిస్తోల్ పైభాగంలోని రిసీవర్‌ను, కార్బన్ ఫైబర్‌తో దిగువ రిసీవర్‌ను తయారు చేశారు. ఆర్మీ అధికారుల వ్యక్తిగత ఆయుధాల కేటగిరీలో అస్మి కీలకపాత్ర పోషించనుంది. కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలకు, వీఐపీ రక్షణ విధులు నిర్వర్తించే వారికి ఈ ఆయుధం ఎంతో ఉపయోగపడుతుందని, ఒక్కోదాని తయారీకి రూ.50 వేలకంటే ఎక్కువ ఖర్చు కాదని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.
Published date : 16 Jan 2021 03:26PM