తొలి మహిళా ఫ్లయిట్ కమాండర్‌గా ధామీ
Sakshi Education
వింగ్ కమాండర్ షలీజా ధామీ భారత వాయుసేనలో ఫ్లయింగ్ యూనిట్ ఫ్లయిట్ కమాండర్ హోదా సంపాదించారు.
దీంతో ఈ బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళా కమాండర్‌గా ధామీ నిలవనుంది. హెలికాప్టర్లను నడపడంలో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ధామీ.. తొలి మహిళా ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా గుర్తింపు పొందింది. అలాగే శాశ్వత ప్రాతిపదికన ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ విభాగంలో చేరిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. పంజాబ్‌లోని లూథియానా ధామీ స్వస్థలం. 1994లో మహిళలను మొదటిసారి ఐఏఎఫ్‌లోకి అనుమతించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వాయుసేనలో తొలి ఫ్లయింగ్ యూనిట్ ఫ్లయిట్ కమాండర్
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : వింగ్ కమాండర్ షలీజా ధామీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వాయుసేనలో తొలి ఫ్లయింగ్ యూనిట్ ఫ్లయిట్ కమాండర్
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : వింగ్ కమాండర్ షలీజా ధామీ
Published date : 29 Aug 2019 05:50PM