Skip to main content

తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా

దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు.
రెండో సారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను మే 31న నిర్మలా చేపట్టారు. గతంలో ఇందిరా గాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖను నిర్వహించినా పూర్తి స్థాయి మంత్రిగా నియమితులయిన మహిళ నిర్మలా సీతారామనే. గతంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దగ్గర సహాయ మంత్రిగా పనిచేసిన నిర్మలా వాణిజ్య, పరిశ్రమల శాఖలను నిర్వహించడంతోపాటు రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.

మరోవైపు విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జైశంకర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. యూపీఏ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ ఒకప్పుడు దౌత్యవేత్త. కానీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి, చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా మంత్రి పదవిని కట్టబెట్టడం ఇదే తొలిసారి. ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు. రాజ్యసభలోనూ సభ్యత్వం లేదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దేశంలో తొలి మహిళా కేంద్ర ఆర్థిక మంత్రి
ఎప్పుడు : మే 31
ఎవరు : నిర్మలా సీతారామన్
Published date : 01 Jun 2019 05:39PM

Photo Stories