తొలి జేమ్స్ బాండ్ హీరో ఇకలేరు
Sakshi Education
స్కాటిష్ నటుడు, నిర్మాత, ఆస్కార్ విజేత, జేమ్స్ బాండ్ సిరీస్ తొలి పాత్రధారి సర్ థామస్ సీన్ కానరీ(90) కన్నుమూశారు.
బహమాస్ రాజధాని నగరం నస్సౌలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1930 ఆగస్టు 25న స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జన్మించిన సీన్‌కానరీ మొత్తం ఏడు చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారు. తొలుత ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ టై్వస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు.
ఉత్తమ సహాయ నటుడిగా...
కేరిర్ తొలినాళ్లలో మిల్క్‌మాన్‌గా, లారీడ్రైవర్‌గా, కార్మికుడిగా పనిచేసిన సీన్‌కానరీ ‘ది అన్ టచ్‌బుల్స్’ చిత్రంలో నటనకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 1989 సంవత్సరంలో పీపుల్ మ్యాగజైన్ ఆయనను ‘సెక్సియస్ట్ మ్యాన్ ఎలైవ్’గా, 1999లో ‘సెక్సియస్ట్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీ’గా ప్రశంసించింది. 2006లో అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్కాటిష్ నటుడు, నిర్మాత, ఆస్కార్ విజేత, జేమ్స్ బాండ్ సిరీస్ తొలి పాత్రధారి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : సర్ థామస్ సీన్ కానరీ(90)
ఎక్కడ : నస్సౌ, బహమాస్

Published date : 03 Nov 2020 05:59PM