Skip to main content

తమిళనాడులోని 7 కులాలకు ఒకే పేరు

తమిళనాడు రాష్ట్రంలో ఏడు కులాలను కలిపి దేవేంద్రకుల వెల్లలార్ అనే ఒకే పేరు కింద పరిగణించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
Current Affairsలోక్‌సభ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలపగా మార్చి 22న రాజ్యసభ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్ట రూపం దాల్చనుంది. బిల్లు ప్రకారం... దేవేంద్రకులన్, కల్లాడి, కుటుంబన్, పల్లన్, పన్నాడి, వథిరియన్, పథరియ కులాల వారు ఇకపై దేవేంద్రకుల వెల్లలార్‌ అనే కులం కింద పరిగణనలోకి వస్తారు.

పుస్తకావిష్కరణ...
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్‌ ఎస్‌కే జోషి రాసిన ‘ఏక్‌ ప్రతిధ్వని–జన్‌ కేంద్రిత్‌ శాసన్‌ కీ ఔర్‌’ పుస్తకాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. మార్చి 22న ఢిల్లీలోని రాజ్‌నాథ్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Published date : 23 Mar 2021 06:21PM

Photo Stories