Skip to main content

టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత

టిక్‌టాక్ యాప్‌పై నిషేధాన్ని మద్రాసు హైకోర్టు ఏప్రిల్ 24న ఎత్తేసింది.
అయితే అశ్లీల వీడియోలను వ్యాప్తి చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడకుండా చూసుకోవాలనీ, ఎవరైనా అలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. టిక్‌టాక్‌ను నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు ఏప్రిల్ 3న ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. బైట్ డ్యాన్స్ సంస్థ టిక్‌టాక్ యాప్‌ను అందిస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : మద్రాసు హైకోర్టు
Published date : 25 Apr 2019 05:12PM

Photo Stories