టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు
మరోవైపు టిక్‌టాక్ యాప్‌నకు సంబంధించిన భద్రత, సెన్సార్‌షిప్ తదితర అంశాలపై నెలకొన్న ఆందోళన విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 3న ఒక ప్రకటన విడుదల చేసింది.
మూడేళ్లలోనే...
2017లో బైట్‌డ్యాన్స్ సంస్థ ప్రారంభించిన టిక్‌టాక్ వీడియో సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. బైట్‌డ్యాన్స్ ఆ తర్వాత మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అనే వీడియో సర్వీస్ ను కూడా కొనుగోలు చేసి టిక్‌టాక్‌తో కలిపింది. మ్యూజికల్‌డాట్‌ఎల్‌వై అమెరికా, యూరప్‌లో బాగా పేరొందింది. బైట్‌డ్యాన్స్ కు చైనా యూజర్ల కోసం డూయిన్ పేరుతో ఇలాంటిదే మరో సర్వీసు ఉంది. చైనాకు చెందిన యాప్ కావడంతో యూజర్ల డేటాను ఆ దేశానికి చేరవేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో ఇప్పటికే దీన్ని నిషేధించారు. తాజాగా టిక్‌టాక్‌ను అమెరికాలో త్వరలోనే నిషేధిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తో చర్చలు
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్
ఎందుకు :టిక్‌టాక్ అమెరికా విభాగం కొనుగోలు విషయమై