తీవ్ర తుపానుగా బుల్‌బుల్ : ఐఎండీ
Sakshi Education
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్ తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం(ఐఎండీ) నవంబర్ 7న వెల్లడించింది.
ఈ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బుల్‌బుల్ తుపాను నవంబర్ 9వ తేదీ వరకు ఉత్తర దిశగా పయనించి... తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.
Published date : 08 Nov 2019 05:47PM