టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
Sakshi Education
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు జూన్ 22న ఆయన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ హిందూ దేవదాయ, ధర్మాదాయ చట్టం, 1987ను అనుసరించి ఈ నియామకం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్ పేర్కొన్నారు. బోర్డులో ఇతర సభ్యుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి 2014లో ఒంగోలు ఎంపీగా గెలుపొందారు.
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సహా పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ముగ్గురు సభ్యులతో మిగిలిన దేవస్థానం పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగానియామకం
ఎప్పుడు : జూన్ 21
ఎవరు : వైవీ సుబ్బారెడ్డి

Published date : 22 Jun 2019 05:37PM