Skip to main content

టీటీడీ చైర్మన్‌గా మరోసారి నియమితులైన వ్యక్తి?

తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు.
ఈ మేరకు దేవదాయశాఖ కార్యదర్శి వాణీమోహన్‌ ఆగస్టు 8న ఉత్తర్వులు జారీచేశారు. సుబ్బారెడ్డి తొలిసారి 2019 జూన్‌ 22న టీటీడీ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం ముగియడంతో జూన్‌ 23 నుంచి టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి చైర్మన్‌గా, అదనపు ఈవో ధర్మారెడ్డి కన్వీనర్‌గా స్పెసిఫైడ్‌ అథారిటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా నియమించింది.

ఇంధన ఆదా బిల్డింగ్‌లకు ‘నీర్మాణ్‌’ అవార్డులు
ఇంధన పొదుపు నిబంధనలను పాటిస్తూ నిర్మించిన కట్టడాలకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ రోడ్‌ మ్యాప్‌ ఫర్‌ మూమెంట్‌ టువర్డ్స్‌ అఫర్డబుల్‌ అండ్‌ నేచురల్‌ హేబిటేట్‌ (ఎన్‌ఈఈఆర్‌ఎంఏఎన్‌–నీర్మాణ్‌)’ పేరిట అవార్డులతో ప్రోత్సహించనుంది. మొత్తం ఎనిమిది విభాగాల్లో అందిస్తున్న అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆగస్టు 8న ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) పాలకమండలి చైర్మన్‌గా మరోసారి నియామకం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : వెవీ సుబ్బారెడ్డి
ఎందుకు : 2021, జూన్‌ 22న టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీకాలం ముగియడంతో...
Published date : 09 Aug 2021 05:50PM

Photo Stories