టీటీ ర్యాంకింగ్స్ లో మానవ్ ఠక్కర్ కు అగ్రస్థానం
Sakshi Education
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జనవరి 3న విడుదల చేసిన ‘అండర్-21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్’లో భారత మానవ్ ఠక్కర్ అగ్రస్థానంలో నిలిచాడు.
2019, డిసెంబర్‌లో జరిగిన నార్త్ అమెరికా ఓపెన్ టోర్నీలో మానవ్ విజేతగా నిలిచాడు. దాంతో తాజా ర్యాంకింగ్స్ లో మానవ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్‌ను అధిరోహించాడు. గతంలో భారత్ తరఫున అండర్-21 విభాగంలో హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు.
రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ స్టేడియానికి జనవరి 3న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ, అతడి భార్య రితిక పాల్గొన్నారు. దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే లక్ష్యంతో స్టేడియం, శిక్షణ కేంద్రం నిర్మించబోతున్నట్లు మిషన్ మార్గదర్శకుడు కమలేష్ పటేల్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ అండర్-21 పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌సలో అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : మానవ్ ఠక్కర్
మాదిరి ప్రశ్నలు

1. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ర్యాపిడ్ విభాగంలో భారత్‌కు తొలి పసిడి అందించిన క్రీడాకారిణి?
1. కోనేరు హంపి
2. ద్రోణవల్లి హారిక
3. తానియా సచ్దేవ్
4. సౌమ్య స్వామినాథన్
- View Answer
- సమాధానం : 1
2. 2023 పురుషు హాకీ ప్రపంచకప్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.?
1. ఇంగ్లండ్
2. ఆస్ట్రేలియా
3. భారత్
4.దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం : 3
Published date : 04 Jan 2020 06:08PM