టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి
Sakshi Education
భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యారు.
హెడ్‌కోచ్ ఎంపిక కోసం ఆగస్టు 16న ముంబైలో సమావేశమైన దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)... రవిశాస్త్రి నియామకానికి ఏకగీవ్రంగా అంగీకరించింది. దీంతో టీమిండియా హెడ్ కోచ్‌గా 2021 టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి కొనసాగనున్నారు.
తాము ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ కపిల్, మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామితో కూడిన సీఏసీ సభ్యులు నిర్ణయం వెలువరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : రవిశాస్త్రి

Published date : 17 Aug 2019 05:01PM