టీ కోవిడ్–19 యాప్ ఆవిష్కరణ
Sakshi Education
కోవిడ్-19పై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘టీ కోవిడ్–19’యాప్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఏప్రిల్ 11న ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తోందన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రజలు, ప్రభుత్వానికి ఉపకరించేలా ఏడబ్ల్యూఎస్, సిస్కోతో పాటు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ క్వాంటెలా సహకారంతో రాష్ట్ర ఆరోగ్య, ఐటీ మంత్రిత్వ శాఖలు ‘టీ కోవిడ్–19’యాప్‌ను రూపొందించాయని తెలిపారు. ఈ యాప్ ద్వారా కోవిడ్–19కు సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కాల్ హెల్త్ అనే టెలీమెడిసిన్ మాడ్యూల్‌తో ఈ యాప్‌ను అనుసంధానం చేయడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వైద్యులతో సంప్రదింపులు జరపవచ్చని వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీ కోవిడ్–19 యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కోవిడ్-19పై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీ కోవిడ్–19 యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కోవిడ్-19పై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు
Published date : 13 Apr 2020 05:53PM