టి20ల్లో ఒక ఇన్నింగ్‌సలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ ఎవరు?
Sakshi Education
ముస్తాక్ అలీ టి20 టోర్నీలో మేఘాలయ కెప్టెన్ పునీత్ బిష్త్ మిజోరాం తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగులు చేసి టి20ల్లో ఒక ఇన్నింగ్‌సలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు.
గతంలో శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా 15 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (18) పేరిట ఉంది. మేఘాలయ 230 పరుగులు సాధించగా, 100 పరుగులు మాత్రమే చేయగలిగిన మిజోరాం 130 పరుగుల తేడాతో చిత్తయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : మేఘాలయ కెప్టెన్ పునీత్ బిష్త్
Published date : 15 Jan 2021 04:00PM