Skip to main content

టెస్టు, టి20 జట్ల కెప్టెన్సీకి డు ప్లెసిస్ రాజీనామా

దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Current Affairsతమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి రాజీనామా చేశాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో సిరీస్ సమయంలో వన్డే జట్టు నాయకత్వం నుంచి డు ప్లెసిస్ తప్పుకోవడంతో వికెట్ కీపర్ డికాక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘మిస్టర్ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వారసుడిగా 2017 ఆగస్టులో దక్షిణాఫ్రికా పగ్గాలు చేపట్టిన 35 ఏళ్ల డు ప్లెసిస్‌కు 2019 వన్డే ప్రపంచకప్ పెద్ద గాయమే చేసింది. ఆ మెగా టోర్నీలో సఫారీ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దక్షిణాఫ్రికా టెస్టు, టి20 జట్ల కెప్టెన్సీకి రాజీనామా
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ఫాఫ్ డు ప్లెసిస్
Published date : 18 Feb 2020 05:42PM

Photo Stories