టెరి వ్యవస్థాపక డెరైక్టర్ ఆర్కే పచౌరి మృతి
Sakshi Education
ప్రముఖ పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టెరి) మాజీ చీఫ్ ఆర్‌కే పచౌరి(79) ఫిబ్రవరి 13న కన్నుమూశారు.
ఢిల్లీలోని ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్లో ఫిబ్రవరి 11న పచౌరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. ‘టెరి’కి వ్యవస్థాపక డెరైక్టర్‌గా పచౌరి సేవలందించారు. లైంగికంగా వేధించారని ఒక సహ ఉద్యోగిని ఆరోపణలు చేయడంతో 2015లో ‘టెరి’ నుంచి ఆయన వైదొలిగారు. 1974లో స్థాపించిన టెరి విద్యుత్, పర్యావరణం, సమ్మిళిత అభివృద్ధి రంగాల్లో కృషి చేస్తోంది.
పురస్కారాలు..
2007లో వాతావరణ మార్పులకు సంబంధించి ఐరాస ఇంటర్-గవర్న్‌మెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) అధ్యక్షుడిగా... అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్‌తో కలిసి పచౌరి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 2001లో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టెరి) వ్యవస్థాపక డెరైక్టర్ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఆర్‌కే పచౌరి(79)
ఎందుకు : అనారోగ్యం కారణంగా

Published date : 14 Feb 2020 05:41PM