Skip to main content

టెన్నిస్‌కు ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి వీడ్కోలు

ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ భామ కరోలైన్ వొజ్నియాకి టెన్నిస్‌కు వీడ్కోలు పలకనుంది.
Current Affairsవచ్చే ఏడాది జనవరిలో జరిగే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతానని వొజ్నియాకి ప్రకటించింది. 29 ఏళ్ల వొజ్నియాకి తన కెరీర్‌లో ఏకై క గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గతేడాది గెల్చుకుంది. 2009, 2014 యూఎస్ ఓపెన్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. ‘టెన్నిస్‌లో నేను కోరుకున్నవన్నీ సాధించాను. నా జీవితంలో ఆట కంటే ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సమయం వస్తే టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని అనుకున్నాను’ అని కెరీర్‌లో 30 సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వొజ్నియాకి తెలిపింది. 2005లో 15 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్‌గా మారిన వొజ్నియాకి 2010లో అక్టోబరులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ స్థానంలో ఆమె 71 వారాలు కొనసాగింది. వరుసగా 11 ఏళ్లపాటు టాప్-20లో నిలిచిన వొజ్నియాకి గాయాల కారణంగా ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో వొజ్నియాకి 37వ ర్యాంక్‌లో ఉంది.

క్విక్ రివ్వూ:
ఏమిటి:
టెన్నిస్‌కు ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి వీడ్కోలు
ఎవరు: కరోలైన్ వొజ్నియాకి
Published date : 07 Dec 2019 05:16PM

Photo Stories