Skip to main content

టెన్నిస్‌కు మారియా షరపోవా వీడ్కోలు

రష్యా టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్‌వన్ మారియా షరపోవా ఆట నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె ఫిబ్రవరి 26న వెల్లడించింది.
Current Affairsఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన 32 ఏళ్ల షరపోవా.. మహిళల టెన్నిస్‌లో అత్యంత గుర్తింపు పొందిన క్రీడాకారిణి. నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన అతి కొద్ది మంది ప్లేయర్లలో ఉంది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడి నిషేధం ఎదుర్కొంది. అనంతరం తిరిగి ఆటలో ప్రవేశించినప్పటికీ మునుపటి స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయింది. ఈ క్రమంలో టెన్నిస్‌కు గుడ్‌బై ప్రకటించింది. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో షరపోవా జన్మించినా... ఏడేళ్ల వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయింది. ఆటలో మాత్రం రష్యాకు ప్రాతినిధ్యం వహించింది. వరుసగా 11 ఏళ్ల పాటు అత్యధిక ఆర్జన ఉన్న మహిళా క్రీడాకారిణిగా ‘ఫోర్బ్స్’ జాబితాలో నిలిచింది.

షరపోవా కెరీర్...
  • షరపోవా సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ : 5 (2004-వింబుల్డన్; యూఎస్ ఓపెన్-2006; ఆస్ట్రేలియన్ ఓపెన్-2008; ఫ్రెంచ్ ఓపెన్-2012, 2014)
  • కెరీర్‌లో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ సంఖ్య : 36
  • ప్రొఫెషనల్‌గా మారిన ఏడాది : 2001
  • అత్యుత్తమ ర్యాంకింగ్ : 1 (ఆగస్టు 22, 2005)
  • కెరీర్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగిన వారాలు : 21
  • ప్రస్తుత ర్యాంక్ : 373
  • మొత్తం గెలిచిన మ్యాచ్‌లు : 645
  • మొత్తం ఓడిన మ్యాచ్‌లు : 171
  • కెరీర్‌లో సాధించిన ప్రైజ్‌మనీ : 3,87,77,962 డాలర్లు (రూ. 277 కోట్ల 76 లక్షలు)

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టెన్నిస్ క్రీడకు వీడ్కోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : మారియా షరపోవా
Published date : 27 Feb 2020 05:28PM

Photo Stories