Skip to main content

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్

దేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కట్టడికి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 22న ప్రకటించారు.
Current Affairsఅత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలు మాత్రం యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెరుు్యతోపాటు ఉచితంగా రేషన్, కిలో పప్పు సరఫరా చేస్తామని తెలిపారు.

తెలంగాణలో...
అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం-1897ను రాష్ట్రంలో ప్రయోగించామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్చి 22న ప్రకటించారు. ఈ చట్టంతో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుందన్నారు. నిత్యావసర, అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తిని మాత్రమే బయటకు అనుమతిస్తారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో తెల్ల రేషన్‌కార్డుగల కుటుంబానికి రూ. 1,500 ఇస్తున్నామని తెలిపారు. అలాగే కార్డులోని ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కేజీల చొప్పున బియ్యం అందజేస్తామన్నారు.
Published date : 23 Mar 2020 06:27PM

Photo Stories