తెలంగాణలోని ఏ జిల్లాలో నూతన ఐటీ టవర్‌కు శంకుస్థాపన జరిగింది?
Sakshi Education
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డిసెంబర్ 10 సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రెండు శంకుస్థాపనలు, 5 ప్రారంభోత్సవాలతో పాటు ఒక పరిశీలన చేపట్టారు.
- కొండపాక మండలంలోని దుద్దెడ శివారు లో రూ.45 కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఐదంతస్తుల ఐటీ టవర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
- తొలిరోజే నాలుగు ఐటీ కంపెనీలు (జోలాన్ టెక్నాలజీ, విసాన్‌టెక్, ఎంబ్రోడ్‌స టెక్నాలజీ, సెట్విన్) రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి.
- జిల్లాలో రూ.22 లక్షల వ్యయంతో సిద్దిపేట రూరల్ మండలంలోని మిట్టపల్లి క్లస్టర్‌లో నిర్మించిన తొలి రైతువేదికను సీఎం ప్రారంభించారు.
- సిద్దిపేట పట్టణ పరిధిలో రూ.715 కోట్ల వ్యయంతో 2,99,852 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభించారు.
- రూ.225 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వెయి్య పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
- నర్సాపూర్‌లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో 45 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 2 పద్ధతిన మొత్తం 2,460 ఇళ్లు నిర్మించారు. సీఎం సమక్షంలో 144 మంది గృహప్రవేశాలు చేశారు.
- పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చేందుకు రూ.278.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను సీఎం ప్రారంభించారు.
- 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్య పల్లగుట్ట ద్వీపంలో నిర్మించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు.
- సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో జరిగిన సుందరీకరణ పనులను సీఎం పరిశీలించారు.
Published date : 11 Dec 2020 05:50PM