తెలంగాణలో శానిటేషన్ హబ్ ఏర్పాటు
Sakshi Education
తెలంగాణలో శానిటేషన్ హబ్ నెలకొల్పనున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్రానికి నివేదించారు.
ఈ మేరకు అక్టోబర్ 30న కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలసి ఈ అంశమై చర్చించారు. ఈ శానిటేషన్ హబ్ దేశవ్యాప్తంగా, దక్షిణాసియాలోనూ పారిశుద్ధ్య నిర్వహణలో సేవలందించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. హైదరాబాద్‌లో నెలకొల్పబోయే ‘అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో ఇది ఒక భాగంగా ఉంటుందన్నారు. ఈ హబ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) అత్యున్నత స్థాయి బ్లూప్రింట్ రూపొందించిందని పేర్కొన్నారు. డిసెంబర్‌లో ఈ శానిటేషన్ ఇన్నోవేషన్ హబ్‌పై అధికారిక ప్రకటన ఉంటుందని మంత్రి వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో శానిటేషన్ హబ్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో శానిటేషన్ హబ్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు
Published date : 31 Oct 2019 05:39PM