తెలంగాణలో రైతుబంధు సాయం పెంపు
Sakshi Education
రైతుబంధు పథకం కింద చేసేపెట్టుబడి సాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు మార్గదర్శకాలను రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జూన్ 1న విడుదల చేశారు. రైతుబంధు పథకం ద్వారాగత ఖరీఫ్, రబీల్లో రైతులకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఆర్‌బీఐకి చెందిన ఈ-కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టాదారు భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమచేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో రైతుబంధు సాయం పెంపు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో రైతుబంధు సాయం పెంపు
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
Published date : 03 Jun 2019 05:50PM