తెలంగాణలో ప్యాకేజింగ్ ఫిల్మ్ ప్లాంట్ ఏర్పాటు
Sakshi Education
పాలిమర్ ఉత్పత్తుల రంగంలో పేరొందిన ఈస్టర్ ఫిల్మ్‌టెక్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రూ.1,350 కోట్ల పెట్టుబడితో ‘ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్’ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు.
ఈస్టర్ ఫిల్మ్‌టెక్ సంస్థ చైర్మన్ అరవింద్ సింఘానియాతో ఆగస్టు 17న వర్చువల్ సమావేశాన్ని నిర్వహించిన మంత్రి ఈ మేరకు తెలిపారు. ఈస్టర్ ఫిల్మ్‌టెక్ తమ అత్యాధునిక పాలిస్టర్ ఫిల్మ్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కంపెనీ నిర్మాణం కోసం తొలి దశలో రూ.500 కోట్లు ఖర్చు చేసి, 2022 మూడో త్రైమాసికం నాటికి పనులు పూర్తి చేస్తారన్నారు. ప్యాకేజింగ్ పరిశ్రమకు చెందిన పాలిమర్ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ద్వారా స్థానికంగా 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ఈస్టర్ ఫిల్మ్‌టెక్ లిమిటెడ్ సంస్థ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ఈస్టర్ ఫిల్మ్‌టెక్ లిమిటెడ్ సంస్థ
Published date : 18 Aug 2020 04:52PM