తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం
Sakshi Education
పట్టణాల్లో సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, పచ్చదనమే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘పట్టణ ప్రగతి కార్యక్రమం’ ప్రారంభమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా 128 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థల్లో (హైదరాబాద్ మినహా) అన్ని వార్డులు, డివిజన్లలోనూ ఫిబ్రవరి 24న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజున రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులు, డివిజన్లలో పాదయాత్రలు చేసి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ వ్యాప్తంగా
ఎందుకు : పట్టణాల్లో సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, పచ్చదనమే ప్రధాన లక్ష్యంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ వ్యాప్తంగా
ఎందుకు : పట్టణాల్లో సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, పచ్చదనమే ప్రధాన లక్ష్యంగా
Published date : 25 Feb 2020 06:12PM