తెలంగాణలో నాగోబా జాతర ప్రారంభం
Sakshi Education
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఫిబ్రవరి 4న ప్రారంభమైంది.
ఏటా పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర ఆరురోజుల పాటు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేయడంతో ఈ గిరిజన జాతర మొదలవుతుంది. ఈ జాతరలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన గిరిజనులు పాల్గొంటారు. నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాగోబా జాతర ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎక్కడ : కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాగోబా జాతర ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎక్కడ : కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
Published date : 05 Feb 2019 05:36PM