తెలంగాణకు మెక్రోసాఫ్ట్ సంస్థ సాయం
Sakshi Education
కోవిడ్-19 మహమ్మారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు మద్దతు పలుకుతూ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా రూ.3.8 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలను అందజేసింది.
ఆగస్టు 28న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన సంస్థ ప్రతి నిధులు వైద్య పరికరాలను అందజేశారు. తాము అందజేసిన 14 అత్యాధునిక కోవిడ్ 19 పరీక్ష యంత్రాల ద్వారా రోజుకు 3,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు.
26 అడుగుల వరకు...
కరోనా వైరస్ బారిన పడకుండా ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదని ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణకు రూ.3.8 కోట్ల విలువ చేసే వైద్య పరికరాల సాయం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : మైక్రోసాఫ్ట్ సంస్థ
ఎందుకు : కోవిడ్-19 మహమ్మారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు మద్దతుగా

Published date : 29 Aug 2020 05:49PM