తెలంగాణకు కాయకల్ప అవార్డులు
Sakshi Education
తెలంగాణలోని పలు జిల్లా కేంద్ర, పీహెచ్‌సీ- సీహెచ్‌సీ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులు వరించాయి.
మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల ప్రాతిపదికన ఆస్పత్రులకు కేంద్రం ఏటా ఇచ్చే ఈ పురస్కారాల ప్ర దానోత్సవం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రం నుంచి జిల్లా ఆస్పత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి మొదటి స్థానం దక్కింది. ద్వితీయ స్థానంలో సంగారెడ్డి, కొండాపూర్ జిల్లా కేం ద్రం ఆస్పత్రులు నిలిచాయి. పీహెచ్‌సీ-సీహెచ్‌సీల విభాగంలో పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రథమ స్థానం దక్కింది. ఆయా ఆస్పత్రుల బాధ్యులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మం త్రి హర్షవర్ధన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణకు కాయకల్ప అవార్డులు
ఎందుకు: మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల..
ఎక్కడ: న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణకు కాయకల్ప అవార్డులు
ఎందుకు: మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల..
ఎక్కడ: న్యూఢిల్లీ
Published date : 12 Oct 2019 04:45PM