Skip to main content

తెలంగాణ యువకుడికి యంగ్ సైంటిస్టు అవార్డు

పత్తిలో అధిక దిగుబడి సాధించేందుకు చేసిన పరిశోధనకు గాను తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం దుబ్బతండాకు చెందిన బానోతు భిక్షపతికి ‘యంగ్ సైంటిస్టు మెరిట్ అకడమిక్ అవార్డు’ లభించింది.
Current Affairsజాతీయ పత్తి పరిశోధన అభివృద్ధి సంస్థ, హర్యానాకు చెందిన ఇస్సార్ సంస్థల ఆధ్వర్యంలో ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో 2020, జనవరి 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సదస్సులో భిక్షపతికి ఈ అవార్డు అందజేశారు. ఎల్‌హెచ్‌డీపీ-1 అనే పత్తి రకం అధిక సేంద్రియ పద్ధతిలో ఎకరానికి 64 వేల మొక్కలు నాటి 20 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేలా పరిశోధన చేసినందుకు భిక్షపతికి ఈ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యంగ్ సైంటిస్టు మెరిట్ అకడమిక్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : బానోతు భిక్షపతి
ఎక్కడ : భువనేశ్వర్, ఒడిషా
ఎందుకు : పత్తిలో అధిక దిగుబడి సాధించేందుకు చేసిన పరిశోధనకు గాను
Published date : 27 Jan 2020 05:22PM

Photo Stories