తెలంగాణ విద్యార్థిని అంజలికి ఇన్ఫోసిస్ అవార్డు
Sakshi Education
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు’ లభించింది.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వార్షిక సమావేశం సందర్భంగా జనవరి 4న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అంజలికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డును అందజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ విద్యార్థిని దారావత్ అంజలి
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
మాదిరి ప్రశ్నలు
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డును అందజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ విద్యార్థిని దారావత్ అంజలి
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
మాదిరి ప్రశ్నలు
1. 107వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
1. బెంగళూరు 2020, జనవరి 3
2. తిరుపతి 2019, జనవరి 3
3. తిరువనంతపురం 2020, జనవరి 3
4. అహ్మదాబాద్ 2020, జనవరి 6
- View Answer
- సమాధానం : 1
2. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2019, అక్టోబర్ 11న ఏ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్’ను అందుకున్నారు?
1. ఈజిప్టు
2. కైరో
3. నైరోబి
4. కొమొరోస్
- View Answer
- సమాధానం : 4
Published date : 06 Jan 2020 06:07PM