Skip to main content

తెలంగాణ టూరిజం ఫిల్మ్‌కు జపాన్ అవార్డు

తెలంగాణ పర్యాటక అందాలకు ‘జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్’ఫిదా అయింది.
ఒసాకా నగరంలో మార్చి 13, 14 తేదీల్లో జరిగిన వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్’కు కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కింది.మార్చి 14న జరిగిన ముగింపు వేడుకల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ డెరైక్టర్ దూలం సత్యనారాయణ ఈ అవార్డు అందుకున్నారు. తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాల అందాలతో రూపొందించిన ఈ పర్యాటక చిత్రం బెస్ట్ ఫిల్మ్ ఇన్ కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కించుకుంది. తెలంగాణ థీమ్ సాంగ్ చిత్రానికి అవార్డ్ రావడంపై పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి బుర్రా వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు తెలంగాణ సొంతమని, ఈ అవార్డుతో ప్రపంచదేశాల నుంచి తెలంగాణకు వచ్చే పర్యాటకులు సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు దూలం సత్యనారాయణకు అభినందనలు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్’కు కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : దూలం సత్యనారాయణ
ఎక్కడ : జపాన్ (ఒసాకా నగరం)
ఎందుకు : తెలంగాణ పర్యాటక అందాలకు
Published date : 15 Mar 2019 06:11PM

Photo Stories