తెలంగాణ సీఈవోగా శశాంక్ బాధ్యతల స్వీకరణ
Sakshi Education
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్ గోయల్ మార్చి 12న బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న శశాంక్ సీఈవోగా ఎంపికైన విషయం తెలిసిందే. గతంలో రాష్ట్ర సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తాజాగా రజత్ స్థానంలో శశాంక్ బాధ్యతలు చేపట్టారు.
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శశాంక్ గతంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డెరైక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : శశాంక్ గోయల్

Published date : 13 Mar 2020 05:36PM