Skip to main content

తెలంగాణ ప్రభుత్వంతో స్విట్జర్లాండ్ ఒప్పందం

హైదరాబాద్‌లో జరగనున్న ‘బయో ఆసియా 2020’ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు స్విట్జర్లాండ్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి డిసెంబర్ 10న తెలంగాణ ప్రభుత్వంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Current Affairsఈ భాగస్వామ్య ఒప్పందంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వానా రెంగ్లి ఫ్రే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఒప్పందం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సుమారు వంద దేశాల నుంచి లైఫ్ సెన్సైస్ దిగ్గజాలను ఆకర్షించడంలో బయో ఆసియా 2020 సదస్సు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్ భాగస్వామ్యం ద్వారా అక్కడి కంపెనీలు, ప్రభుత్వంతో బహుముఖ సంబంధాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : స్విట్జర్లాండ్ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : బయో ఆసియా 2020 సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు
Published date : 11 Dec 2019 05:48PM

Photo Stories