తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ–గోల్కొండ పోర్టల్ ఉద్దేశం?
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు రూపొందించిన ‘ఈ–గోల్కొండ’ వెబ్ పోర్టల్ ప్రారంభమైంది.
తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పోర్టల్‌ను ఏప్రిల్ 1న ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ–గోల్కొండ ద్వారా సంప్రదాయ హస్త కళా కృతులను కొనుగోలు చేసే వీలుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పోర్టల్ ద్వారా ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళా కృతులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది.. ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
12 సశక్తికరణ్ అవార్డులు...
దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు లభించాయి. జాతీయస్థాయిలో రాష్ట్రానికి చెందిన 9 ఉత్తమ గ్రామ పంచాయతీలు, 2 మండలాలు, ఒక జిల్లా పరిషత్‌లకు అవార్డులు లభించాయి. ప్రస్తుతం తెలంగాణ రాçష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ–గోల్కొండ వెబ్ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
ఎక్కడ : ప్రగతిభవన్, హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు

Published date : 02 Apr 2021 06:37PM