తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్‌కుమార్
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
2018 ఫిబ్రవరి 1 నుంచి సీఎస్‌గా కొనసాగుతున్న శైలేంద్ర కుమార్ జోషి డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. దీంతో వెంటనే 1989 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్.. కొత్త సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి పదవీ విరమణ రోజైన 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ సీఎస్‌గా కొనసాగుతారు.
ప్రభుత్వ సలహాదారుగా జోషి...
సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఎస్‌కే జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల వ్యవహారాలు)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమేశ్ కుమార్ నేపథ్యం...
పుట్టిన తేదీ, ప్రాంతం: 22.12.1963, బిహార్
విద్య: ఎంఏ (సైకాలజీ), ఢిల్లీ యూనివర్సిటీ
భార్య: డాక్టర్ జ్ఞాన్ముద్ర, పీహెచ్‌డీ, డీన్ అండ్ ప్రొఫెసర్, ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్
ప్రభుత్వ సలహాదారుగా జోషి...
సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఎస్‌కే జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల వ్యవహారాలు)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమేశ్ కుమార్ నేపథ్యం...
పుట్టిన తేదీ, ప్రాంతం: 22.12.1963, బిహార్
విద్య: ఎంఏ (సైకాలజీ), ఢిల్లీ యూనివర్సిటీ
భార్య: డాక్టర్ జ్ఞాన్ముద్ర, పీహెచ్‌డీ, డీన్ అండ్ ప్రొఫెసర్, ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్
- 1987 నవంబర్ నుంచి 1989 వరకు డీఆర్డీవో సైకాలజిస్టుగా సాయుధ బలగాల అధికారుల ఎంపిక కోసం మానసిక పరీక్షలు నిర్వహించారు
- ఐఏఎస్‌గా తొలి కొలువు: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్‌కలెక్టర్ (ఆగస్టు 1991- మే 93)
- ఐటీడీఏ, పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్‌గా 1993 మే నుంచి 1995 ఏప్రిల్ వరకు
- హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా 1995 మే- 1996 జూన్ వరకు
- యాక్షన్ ఎయిడ్ ఇండియా డెరైక్టర్/వ్యవస్థాపక సీఈవోగా 1996 జూన్ - 2000 జనవరి వరకు
- అనంతపురం జిల్లా కలెక్టర్‌గా జూన్ 2000 నుంచి 02 డిసెంబర్ వరకు
- ఏపీ అర్బన్ సర్వీస్ ఫర్ పూర్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా జనవరి 2003 నుంచి మే 2005 వరకు
- ఎయిడ్ ఎట్ యాక్షన్ దక్షిణాసియా రీజనల్ డెరైక్టర్‌గా మే 2005 నుంచి డిసెంబర్ 2009 వరకు
- ఏపీ కళాశాల విద్య కమిషనర్‌గా జూలై 2008 నుంచి డిసెంబర్ 2009 వరకు
- గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా డిసెంబర్ 2011 నుంచి అక్టోబర్ 2013 వరకు
- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అక్టోబర్ 2013 నుంచి అక్టోబర్ 2015 వరకు
- గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవంబర్ 2015 నుంచి డిసెంబర్ 2016 వరకు
- రెవెన్యూ, ఎకై ్సజ్, సీసీఎల్‌ఏ, రెరా, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డిసెంబర్ 2016 నుంచి ఇప్పటి వరకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన సీఎస్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : సోమేశ్ కుమార్
మాదిరి ప్రశ్నలు
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన సీఎస్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : సోమేశ్ కుమార్
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా 2019, డిసెంబర్ 23న ఎవరు బాధ్యతలు చేపట్టారు.
1. జస్టిస్ సీవీ రాములు
2. జస్టిస్ గుండా చంద్రయ్య
3. జస్టిస్ నడిపల్లి ఆనందరావు
4. జస్టిస్ మహ్మద్ ఇర్ఫాన్
1. జస్టిస్ సీవీ రాములు
2. జస్టిస్ గుండా చంద్రయ్య
3. జస్టిస్ నడిపల్లి ఆనందరావు
4. జస్టిస్ మహ్మద్ ఇర్ఫాన్
- View Answer
- సమాధానం: 2
2. తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా 2019, డిసెంబర్ 23న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1. జస్టిస్ సీవీ రాములు
2. జస్టిస్ కళ్యాణ్ జ్యోతి
3. జస్టిస్ నిరంజన్‌రావు
4. జస్టిస్ స్వరూప్ రెడ్డి
- View Answer
- సమాధానం: 1
Published date : 01 Jan 2020 07:22PM