Skip to main content

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.
Current Affairs
అక్టోబర్ 29న కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీఓటీ) టెండర్లకు సంబంధించిన ఫైనాన్షియల్‌ బిడ్లను తెరిచి ఈ సంస్థను ఎల్‌1గా గుర్తించింది. రూ.494.86 కోట్లకు సంబంధించిన నిర్మాణ అంచనా వ్యయానికి సంబంధించి షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 4.02 శాతం ఎక్సెస్‌ మొత్తానికి కోట్‌ చేసింది.

12 నెలల్లో నిర్మాణం పూర్తి...
టెండర్లలో పాల్గొన్న రెండో సంస్థ ఎల్‌ అండ్‌ టీ (చెన్నై) 4.8 శాతం అధిక మొత్తానికి కోట్‌ చేసింది. టెండర్లలో ఈ రెండు సంస్థలు మాత్రమే పాల్గొన్నందున, తక్కువ మొత్తం కోట్‌ చేసిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఎల్‌1గా గుర్తింపు పొంది నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. కాంట్రాక్టు దక్కించుకున్న షాపూర్‌జీ సంస్థతో రెండు వారాల తర్వాత రోడ్లు, భవనాల శాఖ ఒప్పందం చేసుకోనుంది. 12 నెలల్లో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.

క్విక్ రివ్వూ :

ఏమిటి : తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌
Published date : 30 Oct 2020 05:37PM

Photo Stories