తెలంగాణ నూతన గవర్నర్‌గా డా.తమిళసై సౌందర్‌రాజన్
Sakshi Education
తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన డా.తమిళసై సౌందర్‌రాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను బదిలీ చేస్తూ.. నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌందర్ రాజన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌ల నియమకంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించి.. అక్కడ ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న కల్‌రాజ్ మిశ్రాను రాజస్తాన్‌కు బదిలీ చేసింది.
కొత్త నియమితులైన గవర్నర్లు...
తెలంగాణ: తమిళిసై సౌందర్‌రాజన్
హిమాచల్ ప్రదేశ్: బండారు దత్తాత్రేయ
రాజస్తాన్: కల్‌రాజ్ మిశ్రా
మహారాష్ట్ర: భగత్‌సింగ్ కోశ్యారీ
కేరళ: మహ్మద్ ఖాన్
కొత్త నియమితులైన గవర్నర్లు...
తెలంగాణ: తమిళిసై సౌందర్‌రాజన్
హిమాచల్ ప్రదేశ్: బండారు దత్తాత్రేయ
రాజస్తాన్: కల్‌రాజ్ మిశ్రా
మహారాష్ట్ర: భగత్‌సింగ్ కోశ్యారీ
కేరళ: మహ్మద్ ఖాన్
Published date : 01 Sep 2019 03:38PM