Skip to main content

తెలంగాణ నుంచి ఎయిర్ వైస్‌ మార్షల్ హోదా పొందిన తొలి వ్యక్తి?

తెలంగాణకు చెందిన ఎయిర్ వైస్‌మార్షల్ విష్ణుభొట్ల నాగరాజ్ శ్రీనివాస్‌కు రాష్ట్రపతి అవార్డు లభించింది.
Current Affairs
రక్షణ రంగంలో ఆయనందించిన సేవలకుగానూ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీనివాస్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి విశిష్టసేవా పతకానికి ఎంపికచేసింది. తెలంగాణ నుంచి ఎయిర్ వైస్‌మార్షల్ హోదా పొందిన తొలి వ్యక్తి శ్రీనివాసే. వరంగల్‌లో ఆగస్టు 8, 1963న జన్మించిన శ్రీనివాస్.. 1985, జూన్ 14న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకౌంట్స్ విభాగంలో చేరారు.

రెండు పుస్తకాలు...
2008లో ‘బడ్జెటింగ్ ఫర్ ఇండియన్ డిఫెన్స్: ఇష్యూస్ ఆఫ్ కాంటెంపరరీ రిలవెన్స్’, 2010లో ‘డిఫెన్స్ ఆఫ్‌సెట్స్: ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా’అనే రెండు పుస్తకాలు శ్రీనివాస్ రాశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాష్ట్రపతి విశిష్టసేవా పురస్కారం విజేత
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : ఎయిర్ వైస్‌మార్షల్ విష్ణుభొట్ల నాగరాజ్ శ్రీనివాస్
ఎందుకు : రక్షణ రంగంలో ఆయనందించిన సేవలకుగానూ
Published date : 28 Jan 2021 05:54PM

Photo Stories