Skip to main content

తెలంగాణ నీటిపారుదల శాఖకు సీబీఐపీ అవార్డు

తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) పురస్కారం లభించింది.
ఢిల్లీలో జనవరి 4న సీబీఐపీ 91వ వార్షికోత్సవం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శన, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు గానూ ఈ అవార్డు దక్కింది. మిషన్‌కాకతీయ ఇప్పటి వరకు రూ .8 వేల కోట్ల నిధులతో 27,167 చెరువులను పునరుద్ధరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : మెరుగైన పనితీరుకు
Published date : 05 Jan 2019 05:40PM

Photo Stories