తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ సీవీ రాములు
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములు, ఉప లోకాయుక్తగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి వొలిమినేని నిరంజన్‌రావు నియమితులయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో లోకాయుక్త ఎంపిక కమిటీ డిసెంబర్ 19న ప్రగతి భవన్‌లో సమావేశమై ఈ మేరకు వారి ఎంపికను ఖరారు చేసింది. ఆ వెంటనే వారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి లోకాయుక్త, ఉప లోకాయుక్త ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జస్టిస్ సీవీ రాములు నేపథ్యం...
నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని అచ్చన్నపల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ప్రాథమిక విద్య అనంతరం నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివారు. 1978లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యాక సీనియర్ న్యాయవాది సి.ఆనంద్ దగ్గర జూనియర్‌గా చేశారు. ఉమ్మడి ఏపీలో 24ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి 13 ఏళ్లకు పాటు స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. 2002 డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పలు తీర్పులు చెప్పారు.
వొలిమినేని నిరంజన్‌రావ్ నేపథ్యం...
జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేశారు. సీనియర్ జిల్లా జడ్జిగా ఉండగా రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సమర్ధంగా విధులు నిర్వహించారు. దీంతో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఆయన సేవలను కొనసాగించింది. ఇటీవలే ఆయన న్యాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఆయన పనితీరు, సమర్థతను సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు అభినందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములు

Published date : 20 Dec 2019 05:46PM