Skip to main content

తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌కు నెల్సన్ మండేలా అవార్డు

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్యకు ప్రతిష్టాత్మక ‘నెల్సన్ మండేలా అవార్డు-2020’ లభించింది.
Current Affairs
జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా... ఢిల్లీ నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో నవంబర్ 19న జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ అవార్డును జస్టిస్ చంద్రయ్యకు ప్రదానం చేశారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

నేషనల్ కో.ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా- న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో -ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా ‘నెల్సన్ మండేలా’ అవార్డును ఇస్తున్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : నెల్సన్ మండేలా అవార్డు-2020 విజేత
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : హెచ్చార్సీ తొలి చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ గుండా చంద్రయ్య
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను
Published date : 20 Nov 2020 06:08PM

Photo Stories