Skip to main content

తెలంగాణ హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గుండా చంద్రయ్య నియమితులయ్యారు.
Current Affairsఅలాగే హెచ్‌ఆర్సీ సభ్యులుగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి నడిపల్లి ఆనందరావు(జ్యుడీషియల్), ముహమ్మద్ ఇర్ఫాన్ మొయినొద్దీన్ (నాన్ జ్యుడీషయల్) నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో హెచ్‌ఆర్సీ చైర్మన్ ఎంపిక కమిటీ డిసెంబర్ 19న ప్రగతి భవన్‌లో సమావేశమై ఈ మేరకు వారి ఎంపికను ఖరారు చేసింది. ఆ వెంటనే వారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి హెచ్‌ఆర్సీ చైర్మన్, సభ్యులిద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జస్టిస్ జి.చంద్రయ్య నేపథ్యం...
ఆదిలాబాద్ జిల్లా జొన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1954 మే 10న జన్మించారు. స్వగ్రామంలో మూడో తరగతి వరకు చదివారు. తపలాపూర్‌లో పదో తరగతి చదివాక ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్‌‌ట్స అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్, బీఏ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1980 నవంబర్ 6న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సాంఘిక సంక్షేమ, మున్సిపల్ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2005 మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వా త శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. న్యాయమూర్తిగా తన పరిధిలోని అనేక అంశాలపై కక్షిదారులకు ఉపయుక్తంగా ఉండేలా మానవీయ కోణంలో పలు తీర్పులు చెప్పారు. 2016 మే 9న పదవీ విరమణ చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గుండా చంద్రయ్య
Published date : 20 Dec 2019 05:48PM

Photo Stories