తెలంగాణ హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా శ్రీదేవి
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు.

మే 15న జరిగిన కార్యక్రమంలో ఆమె చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా జ్యుడిషియల్ సర్వీసెస్ కింద ఉత్తరప్రదేశ్‌కు ఎంపికయ్యారు. కింది కోర్టులో జడ్జిగా చేస్తూ 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె చేసుకున్న అభ్యర్థన మేరకు తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మే 15
ఎవరు : జస్టిస్ గండికోట శ్రీదేవి
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మే 15
ఎవరు : జస్టిస్ గండికోట శ్రీదేవి
Published date : 16 May 2019 07:57PM