Skip to main content

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 2న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జూలై నెలాఖరు నాటికి నిత్యం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ గత ఐదేళ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వృద్ధిరేటు సాధించిందని పేర్కొన్నారు.

మరోవైపు పేద వర్గాలకు చేయూతగా ఉన్న పింఛన్లను రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.. అలాగే వికలాంగుల పింఛన్‌ను రూ. 1,500 నుంచి రూ. 3,016కు పెంచుతున్నామని, వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్నామని చెప్పారు. కొత్త పింఛన్లు జూలై 1 నుంచి అందుతాయని వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏటా సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదిక అవుతుండగా ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు ఉండొద్దన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో ఈసారి వేదికను పబ్లిక్ గార్డెన్స్ కు మార్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
ఎక్కడ : పబ్లిక్ గార్డెయి, హైదరాబాద్
Published date : 03 Jun 2019 06:04PM

Photo Stories