తెలంగాణ అంచనాల కమిటీ చైర్మన్ కన్నుమూత
లిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగస్టు 5న గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగిన రామలింగారెడ్డి 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
పేరు: సోలిపేట రామలింగారెడ్డి
తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి
పుట్టిన ఊరు: చిట్టాపూర్ దుబ్బాక
మండలం, సిద్దిపేట జిల్లా
పుట్టిన తేదీ: 1962, అక్టోబర్ 2
భార్య: సుజాత
సంతానం: సతీష్ రెడ్డి, ఉదయశ్రీ
జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు
ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక)
మొదటి టాడా కేసు: జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : సోలిపేట రామలింగారెడ్డి (57)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు: గుండెపోటు కారణంగా