Skip to main content

తెలంగాణ ఐటీ శాఖ మంత్రితో న్యూజెర్సీ గవర్నర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుతో అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ నేతృత్వంలోని బృందం భేటీ అయింది.
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18న జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఇరు రాష్ట్రాలు ‘సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రి మెంట్’ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సంతకాలు చేశారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సెన్సైస్, బయోటెక్, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో ఈ ఒప్పందం జరిగినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ
ఎక్కడ : హైదరాబాద్
Published date : 19 Sep 2019 05:23PM

Photo Stories