టెక్నాలజీ సదస్సులో ఏపీ ఉప ముఖ్యమంత్రి
Sakshi Education
విజయవాడలో సెప్టెంబర్ 6న బిల్డింగ్ న్యూ ఇండియా లివరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జియో స్పేషియల్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్, భారతదేశ సర్వేయర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బిల్డింగ్ న్యూ ఇండియా లివరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బిల్డింగ్ న్యూ ఇండియా లివరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 07 Sep 2019 05:23PM